భారతదేశం, అక్టోబర్ 6 -- OTT Action Thriller: మాస్ మహారాజా రవితేజ తమ్ముడి కొడుకు మాధవ్ భూపతిరాజు హీరోగా ఎంట్రీ ఇచ్చిన రఫ్ అండ్ టఫ్ విలేజ్ డ్రామా 'మారెమ్మ' (Maremma) ఓటీటీ డిజిటల్ స్ట్రీమింగ్‌కు డేట్ ఫిక్స్ చేసుకుంది. థియేటర్లలో ఆశించిన స్థాయిలో రాణించలేకపోయిన ఈ పల్లెటూరి యాక్షన్ థ్రిల్లర్.. అక్టోబర్ 9 నుంచి డిజిటల్ ఆడియెన్స్ ను పలకరించేందుకు రెడీ అయిపోయింది.

ఈ సినిమా ఓటీటీ రైట్స్‌కు సంబంధించి ఇంట్రెస్టింగ్ అప్‌డేట్ బయటికొచ్చింది. ప్రముఖ ప్రాంతీయ ఓటీటీ ప్లాట్‌ఫామ్ 'ఆహా' (Aha) ఈ సినిమాను అక్టోబర్ 9 నుంచి స్ట్రీమింగ్ చేయనున్నట్లు అఫీషియల్‌‌గా అనౌన్స్ చేసింది.

దీనికి తోడు అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime Video) కూడా సైలెంట్‌గా అదే రోజు నుంచి తమ కేటలాగ్‌లో ఈ సినిమాను యాడ్ చేయనున్నట్లు ట్రేడ్ వర్గాల సమాచారం. ఒకే రోజు రెండు దిగ్గజ ప్లాట్‌ఫామ...