భారతదేశం, ఏప్రిల్ 30 -- OTT: వసంత కోకిల.. తమిళంలోనే కాదు తెలుగులోనూ బ్లాక్‌బస్టర్ అయిన సినిమా ఇది. అయితే 44 ఏళ్ల కిందట థియేటర్లలో రిలీజైన ఈ మూవీ ఇప్పటికీ ఏ ఓటీటీలోనూ అందుబాటులో లేకపోవడం అభిమానులను నిరాశపరిచింది. ఎట్టకేలకు ఆ నిరీక్షణకు తెరపడింది. బాలూ మహేంద్ర దర్శకత్వంలో వచ్చిన దృశ్యకావ్యం 'మూండ్రం పిరై' (తెలుగులో 'వసంత కోకిల') డిజిటల్ ప్రిమియర్‌కు సర్వం సిద్ధమైంది. సత్యజ్యోతి ఫిల్మ్స్ ఈ మేరకు అధికారిక ప్రకటన విడుదల చేసింది.

కమల్ హాసన్, శ్రీదేవి నటించిన మూవీ వసంత కోకిల. 1982లో థియేటర్లలో రిలీజైంది. ఇప్పుడు 44 సంవత్సరాల తర్వాత ఈ మూవీ తమిళ ఒరిజినల్ మూండ్రం పిరై మొదటిసారిగా ఓటీటీ వేదికపై అలరించనుంది. రేపటి నుంచి అంటే శుక్రవారం మే 1 నుంచి ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ చిత్రం స్ట్రీమింగ్ కానుంది.

తాజాగా ఈ సినిమాను హై-క్వాలిటీ వ...