భారతదేశం, జూలై 15 -- OTT: మలయాళ వర్సటైల్ యాక్టర్ టొవినో థామస్, అందాల నటి కయదు లోహర్ మోస్ట్ అవేటెడ్ పీరియడ్ యాక్షన్ థ్రిల్లర్ 'పల్లిచట్టంబి' ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ ఎట్టకేలకు ఖరారైంది. థియేట్రికల్ రిలీజ్ తర్వాత దాదాపు మూడు నెలలుగా డిజిటల్ ప్రీమియర్ కోసం ఆసక్తిగా వెయిట్ చేస్తున్న ఆడియన్స్‌కు ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ సోనీ లివ్ (Sony LIV) గుడ్ న్యూస్ చెప్పింది. జులై 24 నుంచి ఈ సినిమా ఐదు భాషల్లో స్ట్రీమింగ్ కానున్నట్లు వెల్లడించింది.

భారీ అంచనాల మధ్య థియేటర్లలో రిలీజ్ అయిన ఈ పాన్ ఇండియా ప్రాజెక్ట్ బాక్స్ ఆఫీస్ దగ్గర తీవ్ర నిరాశనే మిగిల్చింది. 'జనగణమన' లాంటి బ్లాక్‌బస్టర్ హిట్ అందించిన డైరెక్టర్ డిజో జోస్ ఆంటోనీ ఈ సినిమాను ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించారు. అయితే థియేట్రికల్ రన్‌లో ఈ సినిమా ఆడియన్స్‌ను పెద్దగా మెప్పించలేక డిజాస్టర్‌గా నిలిచ...