భారతదేశం, ఆగస్టు 3 -- Khatron Ke Khiladi 15 Rubber Bullets Injury: బుల్లితెర, ఓటీటీ తెరపై అత్యంత ఆదరణ పొందిన సాహసాల రియాలిటీ షో 'ఖత్రోన్ కే ఖిలాడీ 15' (Khatron Ke Khiladi 15) కొత్త సీజన్ వివాదాలకు నిలయంగా మారింది. దక్షిణాఫ్రికాలోని కేప్‌టౌన్ వేదికగా చిత్రీకరించిన ఈ ఓటీటీ షోలోని ఒక స్టంట్ ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో తీవ్ర ఆగ్రహానికి కారణమవుతోంది.

ఎంటర్టైన్మెంట్ పేరిట కంటెస్టెంట్లను తీవ్రంగా హింసించడమేంటని ప్రేక్షకులు విమర్శిస్తున్నారు. ఈ షోలో భాగంగా నిర్వహించిన 'పెయిన్ ఆక్షన్' (Pain Auction) టాస్క్‌లో నటులు శగున్ శర్మ, గౌరవ్ ఖన్నా, విశాల్ ఆదిత్య, కరణ్ వాహి పాల్గొన్నారు.

ఒక వ్యక్తి సైనిక దుస్తుల్లో వచ్చి, వారి వెనుక నిలబడి వరుసగా రబ్బరు బుల్లెట్లతో కాల్పులు జరిపాడు. పోటీదారులు కేవలం స్లీవ్‌లెస్ వేస్ట్, వెన్నుభాగానికి చిన్న ప్రొటెక్టర్ మాత...