భారతదేశం, నవంబర్ 27 -- Mayookha 50 Days Run And OTT Trending: చిన్న సినిమాలకు థియేటర్లలో మూడు రోజులు ప్రదర్శన కొనసాగడమే కష్టంగా మారిన ప్రస్తుత పరిస్థితుల్లో.. తెలుగు సైకలాజికల్ థ్రిల్లర్ 'మయూఖ' అరుదైన విజయాన్ని అందుకుంది. హైదరాబాద్‌లోని ప్రముఖ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ ఐనాక్స్ ఓడియన్ థియేటర్‌లో 50 రోజుల ప్రదర్శనను విజయవంతంగా పూర్తి చేసుకుంది.

శ్రీ తేజ్ ఎస్‌కే దర్శకత్వంలో, శశిధర్ నల్ల నిర్మాణంలో ప్రశ్విత ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై తెరకెక్కిన 'మయూఖ' థియేటర్లలోనే కాకుండా ఓటీటీలోనూ మంచి ఆదరణను సొంతం చేసుకుంది. జియో హాట్‌స్టార్, అమెజాన్ ప్రైమ్ వీడియో వంటి 2 ఓటీటీల్లో టాప్ ట్రెండింగ్‌లో నిలిచి ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది.

థియేట్రికల్, ఓటీటీ కలెక్షన్లు కలిపి మయూఖ సినిమా రూ.3 కోట్లకు పైగా బిజినెస్ సాధించినట్లు అంచనా. ఇది సినిమా నిర్మాణ బడ్జ...