భారతదేశం, ఏప్రిల్ 10 -- OTT: భారతీయ టెలివిజన్ చరిత్రలో సరికొత్త ఒరవడిని సృష్టించిన రియల్ టైమ్ యాక్షన్ థ్రిల్లర్ సిరీస్ '24' మళ్ళీ వస్తోంది. బాలీవుడ్ ఎవర్ గ్రీన్ స్టార్ అనిల్ కపూర్.. ఏటీయూ (ATU) చీఫ్ జై సింగ్ రాథోడ్‌గా నటించిన ఈ ఐకానిక్ షో ఇప్పుడు డిజిటల్ ప్లాట్‌ఫామ్‌పై తన సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించబోతోంది. ఈ సిరీస్‌లోని రెండు సీజన్లు ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ జియో హాట్‌స్టార్ (JioHotstar) లో అందుబాటులోకి రానున్నాయి.

ఈ సిరీస్ స్ట్రీమింగ్ తేదీని అనిల్ కపూర్ స్వయంగా ఒక టీజర్ ద్వారా ప్రకటించారు.

రిలీజ్ డేట్: ఏప్రిల్ 24 (శుక్రవారం)

రిలీజ్ ఇలా: ప్రతి శుక్రవారం 8 ఎపిసోడ్‌ల చొప్పున స్ట్రీమింగ్‌కు రానున్నాయి.

అసలు ఈ సిరీస్ 2013లో కలర్స్ టీవీలో మొదటిసారి ప్రసారమైంది. ఆ తర్వాత 2016లో సెకండ్ సీజన్ వచ్చింది. హాలీవుడ్ సూపర్ హిట్ సిరీస్ '24'కు అధిక...