భారతదేశం, జనవరి 25 -- ప్రస్తుతం ఓటీటీలో కొత్త సినిమాలు సత్తాచాటుతున్నాయి. ఒక్కో ఓటీటీలో ఒక్కో బ్లాక్ బస్టర్ ట్రెండింగ్ లో కొనసాగుతోంది. రొమాంటిక్, హారర్, సస్పెన్స్ థ్రిల్లర్.. ఇలా వేర్వేరు జోనర్లలోని సినిమాలు ఆడియన్స్ ను ఎంగేజ్ చేస్తున్నాయి. మరి ఈ సినిమాలు ఏవి? వీటిని మీరు చూశారా? అని చెక్ చేసుకోండి.

తమిళ స్టార్ హీరో ధనుష్ హిందీలో చేసిన మరో మూవీ తేరే ఇష్క్ మే. తెలుగులో అమర కావ్యం పేరుతో రిలీజైంది ఈ చిత్రం. కృతి స‌న‌న్‌ హీరోయిన్ గా నటించిన ఈ రొమాంటిక్ మూవీ నెట్‌ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతోంది. హీరోయిన్ మోసం చేసిందని తెలుసుకున్నాక హీరో ఎలా మారాడు? అనేది తేరే ఇష్క్ మే లో ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది.

ప్రస్తుతం ఓటీటీలో అదరగొడుతున్న సినిమాల్లో తమిళ సూపర్ హిట్ మూవీ సిరై కూడా ఉంది. ఇది క్రైమ్ కోర్ట్ రూమ్ డ్రామా. ఇందులో హెడ్ కానిస్టేబుల్ కదిరవన్ న...