భారతదేశం, ఫిబ్రవరి 5 -- బుల్లితెరపై సరికొత్త ప్రయోగానికి తెరలేపుతూ వచ్చిన రియాలిటీ షో 'ది 50'. గత బిగ్ బాస్, రోడీస్, స్ల్పిట్స్ విల్లా పాల్గొన్న కంటెస్టెంట్లతో నిండిపోయిన ది 50 షో కేవలం డ్రామాతోనే కాదు.. ఇప్పుడు కాస్టింగ్ వివాదంతోనూ వార్తల్లో నిలుస్తోంది. ఈ షో నుంచి మొదటి కంటెస్టెంట్‌గా ఎలిమినేట్ అయిన వన్షజ్ సింగ్‌తో యూట్యూబర్ శ్రేయ కల్రా మాట్లాడిన మాటలు ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యాయి.

ది 50 షోలో పాల్గొనే అవకాశం తనకు కూడా వచ్చిందని యూట్యూబర్ శ్రేయ కల్రా వెల్లడించారు. "షో మేకర్స్ నాతో మాట్లాడినప్పుడు.. నీ స్నేహితులను కూడా తీసుకురావచ్చు, కానీ ముందే వారి పేర్లు చెప్పాలని అన్నారు. ఆ పేర్లను బట్టి ఎవరిని తీసుకోవాలో వారు నిర్ణయిస్తారు" అని శ్రేయ కల్రా పేర్కొన్నారు.

అంతేకాకుండా, ప్రస్తుతం షోలో ఉన్న కంటెస్టెంట్లలో చాలామంది ప్రిన్స్ నరులా సిఫార్సుత...