భారతదేశం, నవంబర్ 9 -- OTT: సినిమా థియేటర్లతో పాటు ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లు ప్రతి వారం వినోదాన్ని పంచడంలో సరికొత్త పోటీకి తెరలేపుతున్నాయి. ఈ వారం (నవంబర్ 9 నుండి నవంబర్ 15 వరకు) డిజిటల్ ప్రపంచంలో మునుపెన్నడూ లేని విధంగా కంటెంట్ లవర్స్‌కు కళ్లు చెదిరే వెరైటీలు అందుబాటులోకి వస్తున్నాయి. యాక్షన్ థ్రిల్లర్స్, డ్రామా, యూత్‌ఫుల్ కామెడీ, గ్రిప్పింగ్ మిస్టరీల నుంచి ప్రఖ్యాత హాలీవుడ్ సిరీస్ వరకు అన్ని వర్గాల ప్రేక్షకులకు తగిన జాబితా సిద్ధమైంది.

ఈ వారం సౌత్ ఇండస్ట్రీకి చెందిన పలు ఇంట్రెస్టింగ్, క్రేజీ ప్రాజెక్టులు ఓటీటీలోకి వస్తున్నాయి.

జైలర్ 2 (Jailer 2) - నవంబర్ 12 (అమెజాన్ ప్రైమ్ వీడియో): సూపర్‌స్టార్ రజనీకాంత్, దర్శకుడు నెల్సన్ దిలీప్‌కుమార్ కలయికలో వచ్చిన ఈ హై-వోల్టేజ్ మాస్ యాక్షన్ థ్రిల్లర్ తమిళం, తెలుగు, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో సన్‌రైజ్ డి...