భారతదేశం, మార్చి 6 -- ఓటీటీలో తెలుగు సిరీస్ వారం రోజుల్లోనే ఏకంగా 100 మిలియన్ స్ట్రీమింగ్ మినిట్స్ సాధించి దూసుకుపోతోంది. ఈ సిరీసే డాటర్ ఆఫ్ ప్రసాద్ రావు కనబడుటలేదు. ఈ ఓటీటీ సిరీస్‌లో రాజీవ్ కనకాల, ఉదయ భాను, వాసంతిక, శ్రీరామ్ వెంకట్ ప్రధాన పాత్రలు పోషించారు.

ఈ వెబ్ సిరీస్‌ను జీ5 ఓటీటీ తెలుగు నిర్మించింది. 'రెక్కీ', 'విరాటపాలెం' తరువాత సౌత్ ఇండియా స్క్రీన్స్ బ్యానర్ మీద కె.వి. శ్రీరామ్ నిర్మించిన ఈ సిరీస్‌కి కృష్ణ పోలూరు దర్శకత్వం వహించారు.

ఫిబ్రవరి 27 నుంచి జీ5లో డాటర్ ఆఫ్ ప్రసాద్ రావు కనబడుటలేదు ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది. ఓటీటీ రిలీజ్ అయిన వారం రోజుల్లోనే వంద మిలియన్ల స్ట్రీమింగ్ మినిట్స్ సాధించిన ఈ సిరీస్ డాటర్ ఆఫ్ ప్రసాద్ రావు కనబడుటలేదు బ్లాక్ బస్టర్‌ హిట్‌గా నిలిచింది. ఈ క్రమంలో గురువారం (మార్చి 5) నాడు 'డాటర్ ఆఫ్ ప్రసాద్ రావు' టీ...