భారతదేశం, మే 29 -- OTT: అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఇటీవల విడుదలైన కాలేజ్ బోల్డ్ అండ్ రొమాన్స్ డ్రామా 'ఆఫ్ క్యాంపస్' (Off Campus) యూత్ ను ఆకట్టుకుంటోంది. ఈ బోల్డ్ సిరీస్ నుంచి సీజన్ 2 కూడా రాబోతుంది. మరి సీజన్ 2 ఎప్పుడు ఓటీటీలోకి వచ్చే అవకాశం ఉంది? అందులో నటించే నటీనటులపై ఓ లుక్కేయండి.

కాలేజ్ బ్యాక్ డ్రాప్ లో ఫుల్ రొమాంటిక్ అండ్ బోల్డ్ సీన్స్ తో తెరకెక్కిన వెబ్ సిరీస్ 'ఆఫ్ క్యాంపస్'. ఈ సిరీస్ సీజన్ 1 మే 13న అమెజాన్ ప్రైమ్ వీడియోలో రిలీజైంది. ఈ సీజన్ కు అదిరిపోయే రెస్పాన్స్ దక్కుతోంది. ఐఎండీబీలో దీనికి 8.1 రేటింగ్ ఉంది. మొదటి సీజన్‌తోనే ఓటీటీలో భారీ విజయాన్ని సొంతం చేసుకుంది ఆఫ్ క్యాంపస్.

ఎల్ కెన్నెడీ రాసిన ప్రసిద్ధ హాకీ రొమాన్స్ నవలల ఆధారంగా తెరకెక్కిన ఈ యూత్ ఫుల్ డ్రామా, ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో అత్యంత ఆదరణ పొందిన సిరీస్‌లలో ఒకటిగా నిలిచింది. ...