భారతదేశం, జూన్ 4 -- OTT: ఓటీటీ ఆడియన్స్‌కు సరికొత్త సైకలాజికల్ థ్రిల్లర్ ఎక్స్‌పీరియన్స్ ఇవ్వడానికి టాలీవుడ్ మూవీ సిద్ధమైంది. అవికా గోర్, శ్రీ నందు లీడ్ రోల్స్‌లో నటించిన 'అగ్లీ స్టోరీ' (Ugly Story) డిజిటల్ స్క్రీన్ మీద సందడి చేయబోతోంది. ఈ సినిమా జూన్ 5 నుంచి ప్రముఖ రీజనల్ ఓటీటీ ప్లాట్‌ఫామ్ 'ఆహా' (Aha) లో స్ట్రీమింగ్ కానుంది. థియేటర్లలో రిలీజైన చాలా తక్కువ గ్యాప్‌లోనే ఈ సినిమా ఓటీటీకి వచ్చేస్తుండటం విశేషం.

ప్రణవ్ స్వరూప్ డైరెక్షన్‌లో వచ్చిన 'అగ్లీ స్టోరీ' సినిమా మే 22న థియేటర్లలో గ్రాండ్‌గా రిలీజైంది. కానీ కమర్షియల్‌గా బాక్సాఫీస్ దగ్గర ఈ సినిమా ఆడియన్స్‌ను పెద్దగా అట్రాక్ట్ చేయలేకపోయింది. దీంతో థియేట్రికల్ రన్ ముగిసిన వెంటనే డిజిటల్ స్ట్రీమింగ్‌కు రెడీ చేసేశారు.

సాధారణంగా పెద్ద సినిమాలకు నాలుగు నుంచి ఎనిమిది వారాల వరకు థియేట్రికల్ విండో...