భారతదేశం, సెప్టెంబర్ 19 -- Tamil Web Series Octopus OTT Release: ఇటీవల ఎప్పటికప్పుడు ఓటీటీలు సరికొత్త కంటెంట్‌తో ఆడియెన్స్ ముందుకు వస్తున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా ఓటీటీలోకి న్యూ ఫ్యామిలీ క్రైమ్ కోర్ట్ డ్రామా వెబ్ సిరీస్ ఆక్టోపస్ వచ్చేయనుంది.

అయితే, జీ5 ఓటీటీ సంస్థ ఒరిజినల్ సిరీస్‌ల‌కు సంబంధించిన‌ విభాగంలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరుచుకుంటూ.. విభిన్న జోన‌ర్స్‌లో ఆసక్తికరమైన ప్రాంతీయ కథలను ప్రేక్షకులకు అందిస్తోన్న సంగ‌తి తెలిసిందే. ఈ క్ర‌మంలోనే 'ఆక్టోపస్' అనే ఉత్కంఠభరితమైన సస్పెన్స్ థ్రిల్లర్‌ను ఓటీటీ ప్రీమియర్‌కు సిద్ధం చేసింది.

ఈ సిరీస్‌లో శక్తివంతమైన మహిళా ప్రధాన కథతో పాటు.. సస్పెన్స్ థ్రిల్లర్ జోనర్‌లో ఇప్పటివరకు ఉన్న సంప్రదాయ కథనాలకు భిన్నంగా కొత్త తరహా అనుభూతిని అందించనుంది. రహస్యాలు, మిస్టరీలతో ఈ కోర్ట్ రూమ్ డ్రామాను రూపొందిం...