భారతదేశం, నవంబర్ 15 -- OTT Mystery Thriller Octopus Trailer Released: సస్పెన్స్, క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్‌లకు తెలుగు ఓటీటీ ప్రేక్షకుల్లో ఎప్పుడూ ప్రత్యేక క్రేజ్ ఉంటుంది. భాషతో సంబంధం లేకుండా బలమైన కథనం ఉంటే చాలు మన ఆడియన్స్ బ్రహ్మరథం పడుతున్నారు. గతంలో 'సుడల్', 'విలంగు' వంటి తమిళ థ్రిల్లర్ సిరీస్‌లు తెలుగు నాట కూడా భారీ ఆదరణ దక్కించుకున్నాయి.

ఇప్పుడు అదే కోవలో మరో ఆసక్తికరమైన మిస్టరీ థ్రిల్లర్ 'ఆక్టోపస్' (Octopus) ఓటీటీలోకి రాబోతోంది. నవంబర్ 27 నుంచి ఆక్టోపస్ ఓటీటీ స్ట్రీమింగ్ కానుంది. ఈ సందర్భంగా ఇటీవల ఆక్టోపస్ ట్రైలర్‌ను మేకర్స్ విడుదల చేశారు.

జయచంద్ర హష్మీ రచన, దర్శకత్వంలో రూపొందిన 'ఆక్టోపస్' ట్రైలర్ ఆద్యంతం ఉత్కంఠ రేపుతోంది. అందరూ ఒక కుటుంబంలా కలిసిమెలిసి ఉండే ఒక సాధారణ నివాస ప్రాంతం చుట్టూ ఈ కథ తిరుగుతుంది. ప్రశాంతంగా సాగిపోతున...