భారతదేశం, సెప్టెంబర్ 21 -- OTT: కోలీవుడ్ సూపర్ స్టార్ ధనుష్, ఫేమస్ డైరెక్టర్ సెల్వరాఘవన్ తండ్రి, సీనియర్ యాక్టర్-డైరెక్టర్ కస్తూరి రాజా ప్రధాన పాత్రలో నటించిన ఎమోషనల్ డ్రామా 'హబీబి' (Habeebi) డిజిటల్ ప్లాట్‌ఫామ్‌పైకి వచ్చేస్తోంది. ప్రముఖ ఓటీటీ సంస్థ సోనీ లివ్ (SonyLIV) ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 25 నుంచి స్ట్రీమింగ్ చేయడానికి ఆఫీషియల్ అనౌన్స్‌మెంట్ ఇచ్చేసింది. ఐఎండీబీలో 9.2 రేటింగ్ సొంతం చేసుకున్న ఈ మూవీ తెలుగులోనూ స్ట్రీమింగ్ కానుంది.

ఈ ఏడాది జూన్ 12న థియేటర్లలో రిలీజైన ఈ పీరియాడిక్ లవ్ అండ్ ఫ్యామిలీ డ్రామా ప్రేక్షకుల నుంచి మంచి ప్రశంసలు అందుకుంది. ముస్లిం కుటుంబ నేపథ్యం, అందులోని ప్రేమానురాగాలు, సామాజిక పరిస్థితుల ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా ఇప్పుడు ఓటీటీ ఆడియన్స్‌ను అలరించడానికి రెడీ అయింది.

దర్శకుడు మీరా కతిరవన్ తెరకెక్కించిన ఈ చిత్రాన...