భారతదేశం, జూలై 27 -- Main Vaapas Aaunga OTT Release: థియేటర్లలో బాక్సాఫీస్ వద్ద రూ.90 కోట్లకు పైగా వసూళ్లతో అదరగొట్టిన ఇంతియాజ్ అలీ ఎమోషనల్ లవ్ డ్రామా 'మై వాపస్ ఆవుంగా' (Main Waapas Aaunga) ఓటీటీ వినోదానికి సిద్ధమైంది. జూన్ 12న థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులను తీవ్ర భావోద్వేగానికి గురిచేసి మంచి విజయాన్ని అందుకుంది.

'మై వాపస్ ఆవుంగా' కథాంశం దేశ విభజన (Partition) సమయంలో విడిపోయిన ఇద్దరు ప్రేమికుల చుట్టూ తిరుగుతుంది. శతాబ్దాల నాటి ప్రేమకథలకు కొత్త నిర్వచనం ఇచ్చేలా ఇంతియాజ్ అలీ ఈ చిత్రాన్ని మలిచారు. ఇందులో ప్రముఖ నటుడు నసీరుద్దీన్ షా కీలక పాత్ర పోషించగా, ఆయన మనవడి పాత్రలో సింగర్, నటుడు దిల్‌జీత్ దొసాంజ్ అద్భుతమైన నటన కనబరిచారు.

తాత ఆశయాన్ని నెరవేర్చడానికి, సరిహద్దులు దాటి పాకిస్తాన్ వెళ్లే మనవడి ప్రయాణమే ఈ చిత్రంలో ప్రధాన ఆకర్షణగా ...