భారతదేశం, సెప్టెంబర్ 12 -- Parineeti Chopra On OTT Re Entry And Cancelling Mothers: బాలీవుడ్ హీరోయిన్ పరిణీతి చోప్రా సుదీర్ఘ విరామం తర్వాత మళ్లీ కెమెరా ముందుకు వచ్చారు. గతేడాది అక్టోబర్‌లో మగబిడ్డకు జన్మనిచ్చిన ఆమె, ఇప్పుడు 'షాక్' (Shaque) అనే సస్పెన్స్ థ్రిల్లర్ సిరీస్‌తో ప్రేక్షకులను పలకరించేందుకు ఓటీటీలోకి రీ ఎంట్రీ ఇచ్చారు.

ముంబైలో జరిగిన ఈ షాక్ ఓటీటీ సిరీస్ ట్రైలర్ విడుదల వేడుకలో తన వ్యక్తిగత జీవితం, రీ ఎంట్రీ గురించి పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ రాఘవ్ చద్ధాను వివాహం చేసుకున్న పరిణీతి, గతేడాది తల్లిగా కొత్త జీవితాన్ని ప్రారంభించారు.

చివరిగా ఇంతియాజ్ అలీ తెరకెక్కించిన 'అమర్ సింగ్ చమ్కీలా' చిత్రంలో నటించి మంచి ప్రశంసలు అందుకున్నారామె. ఇప్పుడు 'షాక్' ద్వారా ఓటీటీ తెరపైకి అడుగుపెడుతున్నారు. తల్లిగా మారినంత ...