భారతదేశం, మార్చి 13 -- సంక్రాంతి 2026 రేసులో తలపడ్డ సినిమాలన్నీ ఎప్పుడో డిజిటల్ స్ట్రీమింగ్ కు వచ్చాయి. కానీ రవితేజ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ 'భ‌ర్త మ‌హాశ‌యుల‌కు విజ్ఞ‌ప్తి' మాత్రం ఇప్పటికి డిజిటల్ స్ట్రీమింగ్ కు వచ్చింది. వివిధ కారణాల వల్ల ఓటీటీ రిలీజ్ వాయిదా పడుతూ వచ్చిన ఈ మూవీ, ఎట్టకేలకు ఇవాళ డిజిటల్ డెబ్యూ చేసింది.

రవితేజ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ భ‌ర్త మ‌హాశ‌యుల‌కు విజ్ఞ‌ప్తి. ఫ్యామిలీ కామెడీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ మూవీ ఇవాళ (మార్చి 13) ఓటీటీలో అడుగుపెట్టింది. పాపులర్ ఓటీటీ ప్లాట్ ఫామ్ జీ5 తెలుగులో ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతోంది. తెలుగుతో పాటు తమిళ్, కన్నడ, మలయాళం భాషల్లో భ‌ర్త మ‌హాశ‌యుల‌కు విజ్ఞ‌ప్తి సినిమాను ఓటీటీలో చూడొచ్చు.

భ‌ర్త మ‌హాశ‌యుల‌కు విజ్ఞ‌ప్తి సినిమా సంక్రాంతి 2026 బరిలో నిలిచింది. జనవరి 13న థియేటర్లలో రిలీజైంది. ఇప...