భారతదేశం, మే 10 -- OTT: డిజిటల్ వినోదాన్ని ఇష్టపడే ప్రేక్షకులకు ఈ వారం ఓటీటీ వేదికలు విందు భోజనం వడ్డిస్తున్నాయి. ఉత్కంఠ రేకెత్తించే యాక్షన్ థ్రిల్లర్లు, భారీ బడ్జెట్ సీక్వెల్స్, ప్రాంతీయ భాషల్లో సత్తా చాటిన బ్లాక్ బస్టర్ చిత్రాలు ఇప్పుడు మీ మొబైల్, టీవీ స్క్రీన్ల మీద సందడి చేస్తున్నాయి. ప్రముఖ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్స్ అమెజాన్ ప్రైమ్ వీడియో, నెట్‌ఫ్లిక్స్‌లలో అందుబాటులోకి వచ్చిన ఆ టాప్ సినిమాలపై ఓ లుక్కేయండి

'మేజర్', 'గూఢచారి' వంటి సినిమాలతో తెలుగులో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న అడివి శేష్, ఇప్పుడు 'డెకాయిట్' అనే పవర్‌ఫుల్ యాక్షన్ థ్రిల్లర్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. శానీల్ డియో దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో శేష్ సరసన మృణాల్ ఠాకూర్ నటించింది. ప్రతీకారం, దోపిడీ నేపథ్యంలో సాగే ఈ సినిమా ప్రైమ్ వీడియో ఓటీటీలో స్ట్రీమింగ్ అవుత...