భారతదేశం, జూలై 22 -- OTT: భారతీయ డిజిటల్ వీక్షకుల అభిరుచి వేగంగా మారుతోంది. ప్రసిద్ధ మీడియా రీసెర్చ్ సంస్థ 'ఓర్మాక్స్' (Ormax) విడుదల చేసిన తాజా ఓర్మాక్స్ స్ట్రీమ్‌వ్యూ (Ormax StreamView) వీక్లీ రిపోర్ట్ (జూలై 13 నుంచి 19, 2026 వరకు) ఈ విషయాన్ని స్పష్టం చేస్తోంది. డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లలో క్రీడా పోటీలతో పాటు కామెడీ, రియాలిటీ షోలు, రోజువారీ సీరియళ్లు భారీగా వ్యూస్ సాధిస్తూ దూసుకుపోతున్నాయి.

ఓర్మాక్స్ తాజా నివేదిక ప్రకారం జీ5 (ZEE5) ప్లాట్‌ఫామ్‌లో ప్రసారమైన 'ఫిఫా వరల్డ్ కప్ 2026' ఏకంగా 15 మిలియన్ల (1.5 కోట్లు) వీక్షణలతో మొదటి స్థానంలో నిలిచింది. అంతర్జాతీయ ఫుట్‌బాల్ సమరం భారతీయ డిజిటల్ ప్రేమికులను ఏ స్థాయిలో ఆకట్టుకుందో ఈ గణాంకాలు చెబుతున్నాయి.

క్రికెట్ అభిమానులు ఎప్పుడూ ఓటీటీ డిజిటల్ వేదికలపై తమ ఆధిపత్యాన్ని చూపిస్తూనే ఉంటారు. జియోహాట్‌స్...