భారతదేశం, మార్చి 18 -- ప్రపంచ సినీ రంగంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన 98వ ఆస్కార్ అవార్డుల ప్రసారానికి ఈసారి ప్రేక్షకాదరణ తగ్గింది. గత కొన్ని ఏళ్లుగా పెరుగుతూ వచ్చిన రేటింగ్స్, ఈ ఏడాది మళ్లీ తగ్గుముఖం పట్టడం గమనార్హం. ప్రముఖ హోస్ట్ కోనన్ ఓ'బ్రియన్ సారథ్యంలో జరిగిన ఈ వేడుకకు సంబంధించిన గణాంకాలను వాల్ట్ డిస్నీ సంస్థ వెల్లడించింది.

గత ఆదివారం జరిగిన ఆస్కార్స్ 2026 వేడుకను ఏబీసీ (ABC), హులు (Hulu) ప్లాట్‌ఫామ్‌లలో కలిపి సుమారు 17.9 మిలియన్ల (ఒక కోటి 79 లక్షల) మంది వీక్షించారు. గత ఏడాది 'అనోరా' చిత్రం అవార్డు గెలుచుకున్నప్పుడు 19.7 మిలియన్ల మంది ఆ ఈవెంట్ ను చూశారు. ఈ సారి ఆ సంఖ్య 9 శాతం తగ్గింది.

ఆస్కార్స్ 2026 ఈవెంట్ కు ముఖ్యంగా యూత్ దూరంగా ఉన్నట్లు తెలుస్తోంది. గత ఏడాదితో పోలిస్తే ఈ సారి ఈవెంట్ చూసిన వాళ్లలో 18 నుంచి 49 వయసు మధ్య ఉన్నవాళ్లలో 14...