భారతదేశం, జూన్ 25 -- Oscars: ప్రపంచ చలనచిత్ర రంగంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన ఆస్కార్స్ (Oscars) ఓటింగ్ కమిటీలో భారతీయులకు అరుదైన గౌరవం దక్కింది. ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్ కొత్త సభ్యుల లిస్ట్‌ను అఫీషియల్‌గా అనౌన్స్ చేసింది.

ఈ ప్రతిష్టాత్మక అకాడమీ ఓటింగ్ బాడీలో జాయిన్ అవ్వడానికి ప్రపంచవ్యాప్తంగా మొత్తం 529 మంది సినీ ప్రముఖులకు ఇన్విటేషన్స్ పంపగా.. అందులో ఇండియా నుంచి ఆరుగురు స్టార్ టెక్నీషియన్లు చోటు సంపాదించుకుని గ్లోబల్ లెవెల్లో మన సినిమా పవర్‌ను నిరూపించారు. ఈ లిస్ట్‌లో ప్రముఖ బాలీవుడ్ మేకర్ కమ్ మ్యూజిక్ కంపోజర్ విశాల్ భరద్వాజ్, లెజెండరీ ఎడిటర్ ఏ శ్రీకర్ ప్రసాద్ లాంటి టాప్ క్లాస్ సెలబ్రిటీలు ఉండటం విశేషం.

ఈ ఆస్కార్స్ ప్రతిష్టాత్మక లిస్ట్‌లో గ్లోబల్ లెవెల్లో పాపులర్ అయిన హాలీవుడ్ యాక్టర్ల...