Oracle layoffs : ఒరాకిల్‌లో మళ్లీ లేఆఫ్స్- ఉదయం 6 గంటలకు మెయిల్స్.. ఏఐ కోసం ఉద్యోగులపై వేటు!
భారతదేశం, సెప్టెంబర్ 15 -- ఐటీ రంగాన్ని లేఆఫ్స్ భయం మళ్లీ తీవ్రంగా వెంటాడుతోంది. ప్రముఖ సాఫ్ట్వేర్ దిగ్గజం ఒరాకిల్ తమ సిబ్బందికి కోలుకోలేని షాక్ ఇచ్చింది. ఎలాంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండానే మరో విడత భారీ ఉద్యోగాల కోతకు తెరలేపింది. సంస్థ పునర్వ్యవస్థీకరణ పేరుతో సోమవారం నుంచే ఈ తొలగింపుల ప్రక్రియను ప్రారంభించింది. బాధిత ఉద్యోగులకు పిడుగులాంటి ఈమెయిల్స్ పంపడమే కాకుండా, ఆ రోజే చివరి పనిదినమని తేల్చిచెప్పేసింది.
హైదరాబాద్, బెంగళూరు సహా ప్రపంచవ్యాప్తంగా పనిచేస్తున్న భారతీయ ఐటీ ఉద్యోగుల్లో ఈ పరిణామం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది.
కంపెనీ ఉన్నపళంగా లేఆఫ్స్ నిర్ణయాన్ని అమలులోకి తెచ్చిందని ఉద్యోగులకు అందిన తొలగింపు లేఖల ద్వారా తెలుస్తోంది.
"ఒరాకిల్ ప్రస్తుత వ్యాపార అవసరాలను సమగ్రంగా పరిశీలించిన తర్వాత, సంస్థాగత మార్పుల్లో భాగంగా మీ ఉద్యోగాన్ని తొలగ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.