భారతదేశం, మార్చి 26 -- 'ది కాశ్మీర్ ఫైల్స్' చిత్రంతో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన దర్శకుడు వివేక్ రంజన్ అగ్నిహోత్రి, ఇప్పుడు మరో భారీ చిత్రానికి శ్రీకారం చుట్టాడు. టీ-సిరీస్ అధినేత భూషణ్ కుమార్‌తో కలిసి ఆయన 'ఆపరేషన్ సింధూర్' అనే కొత్త సినిమాను ప్రకటించాడు. పాకిస్థాన్ ఆక్రమిత కాశ్మీర్ (PoK) లో భారత సైన్యం జరిపిన మెరుపు దాడుల (Deep Strikes) నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కుతోంది.

ప్రస్తుతం ధురంధర్ 2 మేనియా సాగుతోంది. ఈ మూవీ ట్రెండింగ్ లో కొనసాగుతోంది. దేశభక్తి నేపథ్యంలో వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ ను షేక్ చేస్తోంది. ఈ నేపథ్యంలో వివేక్ అగ్నిహోత్రి మరో దేశభక్తి సినిమా ప్రకటించడం హాట్ టాపిక్ గా మారింది. ఆపరేషన్ సింధూర్ కథాంశంతో ఈ మూవీని తెరకెక్కించనున్నారు.

ఆపరేషన్ సింధూర్ సినిమా లెఫ్టినెంట్ జనరల్ కె.జె.ఎస్. ధిల్లాన్ (రిటైర్డ్) రాసిన 'ఆపరేషన్ స...