భారతదేశం, ఏప్రిల్ 30 -- ప్రభుత్వ శాఖలు అందిస్తున్న అన్ని సేవలు ఈ ఏడాది డిసెంబర్ నాటికల్లా ఆన్‌లైన్‌లో అందించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. వాట్సప్ గవర్నెన్స్ మన మిత్ర పరిధిలోకి అన్ని సేవలు తీసుకు వస్తే ప్రజలకు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగే పని ఉండదని చెప్పారు. ఆర్టీజీఎస్‌పై వివిధ శాఖల ఉన్నతాధికారులతో క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు.
మనమిత్ర వాట్సప్ గవర్నెన్స్ ద్వారా ప్రస్తుతం 1,035 సేవలు అందిస్తున్నామని సీఎం చంద్రబాబు తెలిపారు. వాట్సప్ గవర్నెన్సు సేవలు ప్రారంభించిన దగ్గర నుంచి ఇప్పటి వరకు రాష్ట్రంలో 54 లక్షల మంది 1.78 కోట్ల సేవలు పొందారని ఈ సందర్భంగా ముఖ్యమంత్రికి అధికారులు వివరించారు. వాట్సప్ గవర్నెన్స్ సేవల వినియోగం పై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నామని తెలిపారు. ఇప్పటి వరకూ 24 లక్షల ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.