భారతదేశం, మార్చి 22 -- ఆన్​లైన్​లో ఎంబీఏ కోర్సులు చేయాలని ప్లాన్​ చేస్తున్న వారికి అలర్ట్​! ప్రపంచవ్యాప్తంగా ఉన్న మేనేజ్​మెంట్ కోర్సుల్లో బెస్ట్​ ఆన్‌లైన్ ఎంబీఏ ర్యాంకింగ్స్ 2026ని విడుదల చేసింది ప్రతిష్టాత్మకమైన 'ఫైనాన్షియల్ టైమ్స్ (ఎఫ్​టీ)'. ఈ ఏడాది కూడా స్పెయిన్‌కు చెందిన ఐఈ బిజినెస్ స్కూల్ (IE Business School) తన ఆధిపత్యాన్ని చాటుకుంది. వరుసగా నాలుగోసారి ప్రపంచంలోనే అత్యుత్తమ ఆన్‌లైన్ ఎంబీఏ పీఠాన్ని కైవసం చేసుకుంది.

ముఖ్యంగా జీతాల పెంపు విషయంలో ఈ సంస్థ అగ్రస్థానంలో నిలిచింది. ఇక్కడ కోర్సు పూర్తి చేసిన విద్యార్థులు తమ పాత జీతం కంటే సగటున 42 శాతం అధిక వేతనాన్ని పొందుతున్నట్లు ఈ నివేదిక వెల్లడించింది.

లండన్‌కు చెందిన ఇంపీరియల్ కాలేజ్ బిజినెస్ స్కూల్ ఈ జాబితాలో రెండో స్థానాన్ని దక్కించుకుంది. అయితే, అత్యధిక సగటు వేతనం విషయంలో మాత్రం ఇదే...