భారతదేశం, జూలై 4 -- గతేడాది అక్టోబర్‌లో వచ్చిన వన్‌ప్లస్ ఏస్ 6, ఈ ఏడాది విడుదలైన ఏస్ 6 అల్ట్రా విజయవంతం కావడంతో, వన్‌ప్లస్ సంస్థ ఇప్పుడు తన తదుపరి తరం 'వన్‌ప్లస్ ఏస్ 7' సిరీస్‌పై దృష్టి పెట్టింది. ప్రముఖ చైనీస్ టిప్‌స్టర్ ద్వారా ఈ సిరీస్ తాలూకు అదిరిపోయే స్పెసిఫికేషన్లు ఆన్‌లైన్‌లో లీకయ్యాయి. వాటి వివరాలపై ఓ లుక్కేయండి..

చైనాకు చెందిన ప్రముఖ టిప్‌స్టర్ 'డిజిటల్ చాట్ స్టేషన్' వీబోలో పోస్ట్ చేస్తూ.. వన్‌ప్లస్ సంస్థ ప్రస్తుతం ఏస్ 7 సిరీస్ ప్రొటోటైప్స్ (ఇంజనీరింగ్ శాంపిల్స్) ను టెస్ట్ చేస్తోందని వెల్లడించారు. ఈ లైనప్‌లో వన్​ప్లస్ ఏస్​ 7, వన్​ప్లస్ ఏస్​ 7 ప్రో మోడళ్లు రానున్నట్లు సమాచారం. ఈ ఫోన్లు పవర్‌ఫుల్ గేమింగ్, లాంగ్ బ్యాటరీ లైఫ్‌ను టార్గెట్ చేస్తూ రూపుదిద్దుకుంటున్నాయి.

1. ప్రాసెసర్, పర్ఫార్మెన్స్:

ఈ సిరీస్ ఫోన్లలో క్వాల్కమ్ తదుపరి తర...