భారతదేశం, ఏప్రిల్ 5 -- పోలీసు సేవలను మరింత అందుబాటులోకి తీసుకురావడమే లక్ష్యంగా, తీవ్రమైన నేరాలను ఎదుర్కోవడానికి 'ఆన్-సైట్ ఎఫ్ఐఆర్' (ఇంటి వద్దకే ఎఫ్ఐఆర్) విధానాన్ని అమలు చేస్తున్నట్లు వనపర్తి జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (ఎస్పీ) సునీత రెడ్డి ప్రకటించారు.

ఎస్పీ ప్రకారం.. ఈ ఆన్ సైట్ ఎఫ్ఐఆర్ వల్ల పోలీసు అధికారులు సంఘటనా స్థలంలోనే లేదా బాధితులకు సౌకర్యవంతంగా ఉండే వారి నివాసం, ఆసుపత్రి లేదా ఏదైనా సురక్షితమైన ప్రదేశంలో ఫస్ట్ ఇన్ఫర్మేషన్(FIR) నమోదు చేయవచ్చు. దీనివల్ల, ముఖ్యంగా ఆందోళనకర పరిస్థితులలో బాధితులు పోలీస్ స్టేషన్లకు వెళ్లాల్సిన అవసరం ఉండదు.

హత్య, అత్యాచారం, దోపిడీ, దొంగతనం, కిడ్నాప్, మహిళలు, పిల్లలపై నేరాలు, రోడ్డు ప్రమాదాలు, ఎస్సీ/ఎస్టీ సంబంధిత కేసులు, బాల్య వివాహాలు, ర్యాగింగ్ వంటి తీవ్రమైన నేరాలకు ఈ సౌకర్యం అందుబాటులో ఉంటుంది. స...