భారతదేశం, జూలై 17 -- Oh Sukumari Movie Review In Telugu And Rating: 'మసూద' చిత్రంతో తెలుగు ప్రేక్షకుల్లో నటుడిగా గట్టి ముద్ర వేసుకున్న తిరువీర్, సీనియర్ హీరో వెంకటేష్ సరసన 'సంక్రాంతికి వస్తున్నాం' చిత్రంతో అలరించిన ఐశ్వర్య రాజేష్ మొదటిసారి జోడీగా నటించిన చిత్రం 'ఓ..! సుకుమారి'.

భరత్ దర్శన్ దర్శకత్వంలో గంగా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై మహేశ్వర రెడ్డి నిర్మించిన ఈ చిత్రం భారీ అంచనాల మధ్య జూలై 17, 2026న అంటే ఇవాళ థియేటర్లలోకి వచ్చింది. హీరోయిన్‌ను ముట్టుకుంటే కరెంట్ షాక్ కొడుతుందనే క్రేజీ ఐడియాతో సాగే ఈ కామెడీ డ్రామా ప్రేక్షకులను ఎంతవరకు మెప్పించిందో నేటి ఓ సుకుమారి రివ్యూలో తెలుసుకుందాం.

నరాల యాదగిరి (తిరువీర్) తన సొంత పల్లెటూరిలో సర్పంచ్ అవ్వాలని ఆశపడుతాడు. అతని తాత రాసిన విచిత్రమైన వీలునామా ప్రకారం.. యాదగిరికి లేదా అతని బాబాయ్ కొడుక్కి ఎ...