భారతదేశం, సెప్టెంబర్ 2 -- OG Universe: మరోసారి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులకు పూనకాలు తెప్పించే పిచ్చి క్రేజీ అప్‌డేట్ వచ్చేసింది. పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా 'ఓజీ' (OG) సినిమా డైరెక్టర్ సుజీత్ ఒక స్పెషల్ గ్లింప్స్ వీడియో రిలీజ్ చేసి సోషల్ మీడియాను షేక్ చేశారు. ఈ వీడియోలో 'ఓజీ యూనివర్స్' (OG Universe) గురించి పవన్ కళ్యాణ్, సుజీత్, తమన్ మధ్య జరిగిన హాట్ హాట్ డిస్కషన్స్ చూసి ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు.

డైరెక్టర్ సుజీత్ రిలీజ్ చేసిన స్పెషల్ వీడియోలో మ్యూజిక్ డైరెక్టర్ తమన్ ఓజీ సీక్వెల్ గురించి కొన్ని క్రేజీ విషయాలు రివీల్ చేశారు. 'ఓజీ 2' సినిమాను మన ఇండియా బ్యాక్‌డ్రాప్‌లో, సౌత్ ఈస్ట్ ఏషియన్ ఎమోషన్స్, వెస్ట్రన్ ప్రజెంటేషన్‌తో ప్లాన్ చేస్తున్నట్లు ఆయన చెప్పారు. కొత్త బ్లడ్ గ్రూప్ ఓజీ అని తమన్ అనగా.. ఓజీ యూనివర్సల్ బ్లడ్ గ్రూప...