భారతదేశం, నవంబర్ 9 -- ప్రపంచంలోనే అత్యంత విలువైన ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) చిప్ తయారీ సంస్థ 'ఎన్విడియా' సీఈఓ జెన్సన్ హువాంగ్ తన వ్యక్తిగత జీవితానికి సంబంధించి సంచలన విషయాన్ని వెల్లడించారు. ఒక మహిళతో తనకు వివాహేతర సంబంధం ఉందని బహిరంగంగా అగీకరించారు. ఈ మహిళ.. చైనా గూఢచార సంస్థకు పనిచేస్తున్నట్టు ఆరోపణలు ఉన్నాయి. అమెరికా ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తున్న ఈ చైనా స్పై వ్యవహారంపై ఎన్విడియా బోర్డు అంతర్గత విచారణకు ఆదేశించిన వెంటనే, జెన్సన్ తన ఉద్యోగులకు ఈ మేరకు సుదీర్ఘమైన ఈమెయిల్ పంపారు.

ప్రపంచవ్యాప్తంగా ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ విప్లవానికి మూలస్తంభంగా నిలిచిన ఎన్విడియా అధినేతే.. చైనా గూఢచర్యం వ్యవహారంలో చిక్కుకోవడం గ్లోబల్ టెక్ మార్కెట్లలోనే కాకుండా టెక్ కమ్యూనిటీలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

ఈ వివాదం నవంబర్ 7న వెలుగులోకి వచ్చింది. ఆసి...