భారతదేశం, జూన్ 3 -- Nushrratt Bharuccha: బాలీవుడ్ హాట్ బ్యూటీ నుస్రత్ భరుచా పేరు ఇప్పుడు మార్మోగుతోంది. ఈ భామ ట్రెండింగ్ లో కొనసాగుతోంది. తాజాగా సోషల్ మీడియాలో ఆమె పెట్టినట్లు చెబుతున్న ఒక పోస్ట్ ఇప్పుడు నెట్టింట తీవ్ర చర్చనీయాంశంగా మారింది. దీని వెనుకాల ఉన్న అసలు నిజం ఏంటీ? అనేది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది.

ఐపీఎల్ 2026 సీజన్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) టైటిల్ గెలుచుకున్న సంగతి తెలిసిందే. ఆర్సీబీ సాధించిన ఈ చరిత్రాత్మక విజయాన్ని సెలబ్రేట్ చేస్తూ నుస్రత్ భరుచా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఒక స్టోరీని షేర్ చేశారనే వార్త విపరీతంగా ప్రచారంలోకి వచ్చింది. ఆమె విన్నింగ్ మూమెంట్స్ వీడియోను స్టోరీగా పెట్టారనే పోస్టులు చక్కర్లు కొడుతున్నాయి.

నుస్రత్ భరుచా పోస్టు చేసినట్లు చెబుతున్న ఆ ఇన్‌స్టాగ్రామ్ స్టోరీ వీడియోలో ఆర్సీబీ గెలిచిన మూమెం...