భారతదేశం, నవంబర్ 16 -- NTR Anil Ravipudi: టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద ఎన్టీఆర్, అనిల్ రావిపూడి ఫస్ట్ టైమ్ జతకడుతుండటంతో భారీ అంచనాలు నెలకొన్నాయి. అనిల్ రావిపూడి మార్క్ కామెడీ టైమింగ్, ఎన్టీఆర్ యాక్షన్ ఇమేజ్ కలయికలో ఈ సినిమా సరికొత్తగా ఉండబోతోంది. ఈ సినిమాకు దివంగత నటసార్వభౌమ నందమూరి తారకరామారావు బ్లాక్ బస్టర్ సినిమా స్ఫూర్తితో ఓ పేరును పరిశీలిస్తున్నారట.

తాజా ఇండస్ట్రీ సమాచారం ప్రకారం ఈ మూవీకి 'దాన వీర శూర' (Dhana Veera Soora) అనే పవర్ ఫుల్ టైటిల్‌ను మేకర్స్ పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ ఇదే టైటిల్ ఫైనల్ అయితే మాత్రం థియేటర్లలో రచ్చ మామూలుగా ఉండదు. ఈ పవర్ ఫుల్ టైటిల్ వినగానే నందమూరి అభిమానుల్లో ఎక్కడలేని జోష్ కనిపిస్తోంది.

ఈ 'దాన వీర శూర' టైటిల్ గురించి అధికారిక ప్రకటన ఇంకా రాకపోయినా, సోషల్ మీడియాలో మాత్రం ఈ వార్త విపరీతంగా ట్రెండ్...