భారతదేశం, సెప్టెంబర్ 24 -- ట్రేడర్లు, ఇన్వెస్టర్లు ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న నేషనల్ స్టాక్ ఎక్స్​ఛేంజ్ (ఎన్​ఎస్​ఈ) ఐపీఓ గురువారం ఉదయం 10 గంటలకు స్టాక్​ మార్కెట్​లో లిస్ట్ అయ్యింది. బీఎస్​ఈలో ఎన్​ఎస్​ఈ షేర్లు రూ. 1800 వద్ద ఓపెన్ అయ్యాయి. ఐపీఓ అప్పర్​ ప్రైజ్​ బ్యాండ్​ (రూ. 1785)తో పోల్చితే ఇది 0.84శాతం ప్రీమియం.

సెబీ నిబంధనల కారణంగా ఎన్​ఎస్​ఈ షేర్లు ఎన్​ఎస్​ఈలో ట్రేడ్ అవ్వవు. బీఎస్​ఈలోనే ట్రేడ్ చేయాల్సి ఉంటుంది.

కంపెనీ ఆఫర్ చేసిన 8.86 కోట్ల షేర్లకు గాను ఏకంగా 50.58 కోట్ల షేర్ల కోసం బిడ్లు దాఖలయ్యాయి. ఇన్‌స్టిట్యూషనల్ ఇన్వెస్టర్లు (క్యూఐబీ) ఈ ఐపీఓపై విశేష ఆసక్తి చూపారు. క్యూఐబీ కేటగిరీ ఏకంగా 12.68 రెట్లు సబ్‌స్క్రైబ్ కావడం విశేషం.

నాన్-ఇన్‌స్టిట్యూషనల్ ఇన్వెస్టర్ల (ఎన్​ఐఐ) కేటగిరీ 6.55 రెట్ల సబ్‌స్క్రిప్షన్ సాధించగా, రిటైల్ ఇన్వెస్టర్ల...