భారతదేశం, సెప్టెంబర్ 15 -- భారత స్టాక్ మార్కెట్ ట్రేడర్లు, ఇన్వెస్టర్లు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఎన్​ఎస్​ఈ ఐపీఓ సబ్​స్క్రిప్షన్​కి ఇంకా రెండు రోజుల సమయమే మిగిలింది! క్యాష్ మార్కెట్, ఈక్విటీ డెరివేటివ్స్ విభాగాల్లో అత్యధిక ట్రేడింగ్ వాల్యూమ్‌తో తిరుగులేని ఆధిపత్యం చెలాయిస్తున్న నేషనల్ స్టాక్ ఎక్స్​ఛేంజ్.. రూ. 22,568.94 కోట్ల నిధుల సేకరణ లక్ష్యంగా మార్కెట్​లోకి అడుగుపెడుతోంది.

భారత కార్పొరేట్ చరిత్రలోనే రెండో అతిపెద్ద పబ్లిక్ ఇష్టూగా నిలవనున్న ఈ ఎన్​ఎస్​ఈ ఐపీఓ గ్రే మార్కెట్ ప్రీమియం ఎంత? ఐపీఓకి అప్లై చేయాలా? వద్దా? వంటి వివరాలను ఇక్కడ డీటైల్డ్​గా తెలుసుకోండి..

ఎన్‌ఎస్‌ఈ ఐపీఓ సెప్టెంబర్ 17 (గురువారం) సబ్‌స్క్రిప్షన్ కోసం తెరుచుకోనుండగా, సెప్టెంబర్ 21 (సోమవారం) నాటితో గడువు ముగుస్తుంది. షేర్ల కేటాయింపు (అలాట్​మెంట్) ప్రక్రియ సెప్టెం...