భారతదేశం, డిసెంబర్ 23 -- వయసు మళ్ళిన తర్వాత ఆర్థికంగా ఎవరిపైనా ఆధారపడకుండా ఉండాలంటే పక్కా రిటైర్మెంట్ ప్లాన్ ఉండాలి. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం నేషనల్ పెన్షన్ సిస్టమ్ (NPS)ను సమూలంగా ప్రక్షాళన చేసింది. పెట్టుబడిదారుల నుంచి వస్తున్న విజ్ఞప్తులను పరిగణనలోకి తీసుకుని, పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ (PFRDA) విత్‌డ్రాయల్, పెట్టుబడి నిబంధనలను మరింత సులభతరం చేసింది.

ఎన్పీఎస్ నుంచి వైదొలిగే (Exit) సమయంలో గతంలో ఉన్న కఠిన నిబంధనలను సడలించారు.

పూర్తి విత్‌డ్రాయల్: మీ మొత్తం పెన్షన్ నిధి (Corpus) రూ. 8 లక్షల లోపు ఉంటే, దానిని 100% విత్‌డ్రా చేసుకోవచ్చు.

లంప్ సమ్ బెనిఫిట్: నిధి రూ. 12 లక్షలు దాటితే, 80% నగదును ఒకేసారి తీసుకోవచ్చు. కేవలం 20% మాత్రమే యాన్యుటీ (నెలవారీ పెన్షన్) కోసం కేటాయించాల్సి ఉంటుంది.

తగ్గిన లాక్-ఇన్ పీరియడ్: ...