భారతదేశం, జూలై 6 -- లండన్‌కు చెందిన ప్రముఖ టెక్ బ్రాండ్ 'నథింగ్'.. భారత మార్కెట్లో మరో సంచలనానికి సిద్ధమైంది. ఇప్పటికే తన వినూత్న డిజైన్లతో మార్కెట్లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఈ సంస్థ ఇప్పుడు సరికొత్త వ్యూహంతో ముందుకు వస్తోంది. ప్రస్తుతం ఉన్న ప్రీమియం సిరీస్, మిడ్-రేంజ్ 'ఏ' సిరీస్ కంటే తక్కువ ధరలో సరికొత్త 'బీ' సిరీస్‌ని ఇండియాలో పరిచయం చేస్తోంది. ఈ మేరకు ఈ సిరీస్ నుంచి వస్తున్న మొట్టమొదటి స్మార్ట్‌ఫోన్ 'నథింగ్ ఫోన్ 4బీ' రేపు (జూలై 7) భారత్‌లో అధికారికంగా విడుదల కానుంది.

నథింగ్ ఫోన్ 4బీ స్మార్ట్​ఫోన్ లాంచ్ ఈవెంట్ జులై 7వ తేదీ మధ్యాహ్నం 3:30 గంటలకు ప్రారంభం కానుంది. ఈ కార్యక్రమాన్ని నథింగ్ అధికారిక యూట్యూబ్ ఛానెల్, సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా ప్రత్యక్ష ప్రసారం చేయనున్నారు.

ఈ లాంచ్‌లో భాగంగా క్రికెట్ అభిమానుల కోసం నథింగ్ సంస్...