Nora Fatehi: ఐటమ్ భామ నోరా ఫతేహికి రూ. 3 కోట్ల పరువు నష్టం దావా.. అలా వీడియోలు తీసినందుకు కోర్టులో కేసు!
భారతదేశం, సెప్టెంబర్ 7 -- Nora Fatehi 3 Crore Defamation Case: బాలీవుడ్ నటి, ప్రముఖ డ్యాన్సర్ నోరా ఫతేహికి ఊహించని న్యాయపరమైన చిక్కులు ఎదురయ్యాయి. ఒక చార్టర్డ్ విమానాన్ని ఉద్దేశించి సోషల్ మీడియాలో ఆమె చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తీవ్ర వివాదానికి దారితీశాయి. సదరు ఏవియేషన్ సంస్థ ప్రతిష్టను దెబ్బతీశారనే ఆరోపణలతో గుజరాత్‌లోని గాంధీనగర్ కోర్టులో నోరాపై రూ. 3 కోట్ల మాననష్ట దావా దాఖలైంది.
గత డిసెంబరులో ముంబై నుంచి జైపూర్ ప్రయాణిస్తున్న సమయంలో డ్యూన్స్ ఏవియేషన్‌కు చెందిన సెస్నా సైటేషన్ CJ2 చార్టర్డ్ విమానంలో నోరా ఫతేహి ప్రయాణించారు. ఆ సమయంలో విమానం లోపల వీడియోలు తీసి తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేశారు.
ఆ వీడియోల్లో విమానాన్ని "చిన్న బొమ్మ", "లెగో ఏరోప్లేన్", "టాయ్ ప్లేన్" అంటూ నోరా ఫతేహి వర్ణించారు. రూ. 4.6 కోట్లకు పైగా ఫాలోవర్లు ఉన్న ఆమె ఖాతాల...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.