భారతదేశం, జూన్ 5 -- Nolan The Odyssey: సినిమాను కేవలం ఒక కథలా కాకుండా, థియేటర్లలో ఒక ఎపిక్ ఎక్స్‌పీరియన్స్‌లా మార్చగల ఏకైక దర్శకుడు క్రిస్టోఫర్ నోలన్ (Christopher Nolan). 'ఒపెన్‌హైమర్' సంచలనం తర్వాత ఆయన నుంచి వస్తున్న అత్యంత ప్రతిష్టాత్మక మైథిక్ యాక్షన్ డ్రామా 'ది ఒడిస్సీ' (The Odyssey). ఈ విజువల్ వండర్ కోసం ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ ప్రియులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు.

గ్లోబల్ ఆడియన్స్ కంటే ముందే భారతీయ ప్రేక్షకులకు ఒక అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పింది ది ఒడిస్సీ పంపిణీ సంస్థ వార్నర్ బ్రదర్స్ డిస్కవరీ ఇండియా. జూన్ 8, 2026 నుంచి ఇండియాలో 'ది ఒడిస్సీ' ఐమాక్స్ (IMAX) అడ్వాన్స్ బుకింగ్స్ అధికారికంగా ప్రారంభం కానున్నాయి. ప్రపంచవ్యాప్తంగా జూలై 17, 2026న విడుదల కానున్న ఈ సినిమాకు.. మన దేశంలోనే అందరికంటే ముందుగా టికెట్లు బుక్ చేసుకునే సువర్ణావకాశ...