భారతదేశం, అక్టోబర్ 10 -- Nivetha Thomas: కథా ప్రాధాన్యమున్న పాత్రలను ఎంచుకుంటూ టాలీవుడ్‌లో తనదైన ప్రత్యేక శైలిని సంపాదించుకున్న నటి నివేదా థామస్. తన సరికొత్త ప్రాజెక్ట్ షూటింగ్ మొదలవుతున్న సందర్భంగా ఒక ఎమోషనల్ పోస్ట్‌ను సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. సరికొత్త సెట్‌లోకి అడుగుపెడుతున్న వేళ మనసులో కలిగే ఉత్సాహం, కాస్త నెర్వస్‌నెస్‌ను వ్యక్తపరుస్తూ ఆమె చేసిన ఈ పోస్ట్ ప్రస్తుతం సినీ వర్గాల్లో విశేషంగా ఆకట్టుకుంటోంది.

నివేదా థామస్ ఇవాళ (అక్టోబర్ 10) చేసిన ఓ ఎక్స్ పోస్ట్ వైరల్ గా మారింది. ఇందులో ఆమె.. "అంతా సిద్ధమైంది! ఒక కొత్త ప్రపంచంలోకి అడుగుపెట్టేందుకు సన్నద్ధమవుతున్నా. ఇది నాకు బాగా తెలిసిన ప్రపంచమే అయినప్పటికీ, ఇది నాకెంతో అవసరమైంది. తనదైన శైలిలో ఎంతో సహజమైంది.

కొత్త సెట్‌లో మొదటి రోజు సమీపిస్తున్న వేళ నాలో ఒక రకమైన నెర్వస్ ఎనర్జీ కల...