భారతదేశం, జూలై 5 -- Niti Taylor On Ex Boyfriend In Alliance OTT Show:

గ్లామర్ ప్రపంచంలో మెరిసిపోయే సెలబ్రిటీల జీవితాల వెనుక ఎన్నో చీకటి కోణాలు ఉంటాయి. వెండితెరపై లేదా బుల్లితెరపై ఎంతో సంతోషంగా కనిపించే నటీమణులు.. తమ వ్యక్తిగత జీవితంలో ఎంతటి నరకాన్ని అనుభవిస్తారో తెలిపే ఘటనలు తరచూ వెలుగులోకి వస్తూనే ఉన్నాయి.

తాజాగా హిందీ టెలివిజన్ రంగంలో స్టార్ ఇమేజ్ ఉన్న తెలుగు హీరోయిన్ నీతి టేలర్ తన జీవితంలోని అత్యంత భయంకరమైన రోజులను గుర్తుచేసుకుని కన్నీరు పెట్టుకున్నారు. గతంలో తను ఒక క్రూరమైన, హింసాత్మక రిలేషన్‌షిప్‌లో ఉండిపోయానని, ఆ సమయంలో తన మాజీ ప్రియుడు పెట్టిన టార్చర్ వర్ణనాతీతమని వెల్లడించారు.

అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోన్న సరికొత్త రియాలిటీ గేమ్ షో 'అలయన్స్' (Alliance) లో నీతి టేలర్ ఈ షాకింగ్ విషయాలను బయటపెట్టారు. ఈ ఓటీటీ ష...