భారతదేశం, మే 6 -- Nithiin: వరుసగా డబుల్ హ్యాట్రిక్ ఫ్లాప్ లు.. సరైన బ్రేక్ కోసం అయిదేళ్లకు పైగా ఎదురు చూపులు.. ఇదీ ఇప్పుడు హీరో నితిన్ పరిస్థితి. వరుసగా ఎదురు దెబ్బలు తింటున్న ఈ హీరో ఇప్పుడు మరో కొత్త సినిమా షురూ చేశాడు. క్రేజీ కాంబినేషన్లో తెరకెక్కబోతున్న ఈ సినిమాతోనైనా తన లక్ మారుతుందేమో చూడాలి.

ఒకప్పుడు టాలీవుడ్ లవర్ బాయ్ గా పేరు తెచ్చుకున్నాడు నితిన్. వరుసగా హిట్లు అందుకున్నాడు. కానీ ఇప్పుడు మాత్రం వరుసగా డిజాస్టర్లే ఎదురవుతున్నాయి. ఈ నేపథ్యంలో కొత్త డైరెక్టర్లతో, మిరాయ్ బ్యూటీతో కలిసి నితిన్ కొత్త మూవీ మొదలెట్టాడు. సితారా ఎంటర్ టైన్మెంట్స్ పై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్న ఈ మూవీ పూజ కార్యక్రమం ఈ రోజు జరిగింది.

నితిన్ కొత్త సినిమాలో మిరాయ్ తో కుర్రాళ్ల కలల రాణిగా మారిపోయిన రితికా నాయక్ హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమాతోనే నర్రి, స...