భారతదేశం, జూన్ 11 -- ఉద్యోగం కోసం దరఖాస్తు చేయాలంటే సాధారణంగా ఒక మంచి రెజ్యూమ్, ఈమెయిల్ ఉంటే సరిపోతుంది. కానీ, 19 ఏళ్ల నిసర్గ అధికారి విషయంలో మాత్రం కథ పూర్తిగా అడ్డం తిరిగింది! సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్​ఈ) ఆన్-స్క్రీన్ మార్కింగ్ పోర్టల్‌లో ఉన్న భారీ భద్రతా లోపాలను వివరిస్తూ అతను రాసిన ఒక బ్లాగ్ పోస్టే.. నేడు ఆయనకు దేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన ఐఐటీ కాన్పూర్‌లో ఏకంగా సైబర్ సెక్యూరిటీ ఇంజనీర్ ఉద్యోగాన్ని తెచ్చిపెట్టింది.

నిసర్గ అధికారి.. ఈ వారంలోనే ఐఐటీ కాన్పూర్‌కు చెందిన టెక్నాలజీ ఇన్నోవేషన్ హబ్ (C3iHub)లో ఓపెన్-సౌర్స్ ఇంటెలిజెన్స్, థ్రెట్ ఇంటెలిజెన్స్ ఇంజనీర్‌గా నియమితులయ్యారు. ఈ ఏడాదిలోనే తన 12వ తరగతి (ఇంటర్మీడియట్) పూర్తి చేసిన నిసర్గ, ఐఐటీ కాన్పూర్‌లో ఉద్యోగం సంపాదించిన అత్యంత పిన్న వయస్కుడైన ఇంజనీర్లలో ఒకరిగ...