భారతదేశం, నవంబర్ 28 -- Niro Glimpse: ఫేమస్ తెలుగు లిరిసిస్ట్ కల్యాణ చక్రవర్తి డైరెక్టర్ గా మారి తెరకెక్కిస్తున్న మూవీ 'నీరో'. ఈ మూవీ కోసం అందరూ కొత్తవాళ్లు ఒక్క చోట చేరారు. కొత్త ప్రొడ్యూసర్, కొత్త హీరోహీరోయిన్లతో రూపొందుతున్న ఈ సినిమా ఫస్ట్ గ్లింప్స్ ఇవాళ (నవంబర్ 28) రిలీజైంది.

నీరో గ్లింప్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో రచ్చ చేస్తోంది. గ్లింప్స్ రిలీజ్ అయిన వెంటనే ఇంటర్నెట్ లో తెగ వైరల్ గా మారింది. ఇందులో డిఫరెంట్ కాన్సెప్ట్ తో డిజైన్ చేసిన ఓ సీనే అందుకు కారణం. తగలబడిపోతున్న భవనంలో ఊయలపై పడుకొని ఉన్న హీరోయిన్ ఎదపై హీరో కవిత రాయడం మామూలుగా లేదు.

''ప్రేమంటే.. షాజహాన్ కట్టిన తాజ్ మహల్ కాదు.. తాజ్ మహల్ కట్టిన షాజహాన్'' అని అమ్మాయి ఎద మీద హీరో రాయడం ఇప్పుడు సోషల్ మీడియాలో రచ్చ లేపుతోంది.

నీరో మూవీ ఫస్ట్ గ్లింప్స్ ను డిజిటల్ గా వదిన రష్మిక మందన్...