భారతదేశం, జూన్ 22 -- హిందూ ధర్మంలో ఏకాదశి వ్రతాలకు విశేష ప్రాముఖ్యత ఉంది. ముఖ్యంగా జ్యేష్ఠ శుక్ల పక్షంలో వచ్చే 'నిర్జల ఏకాదశి'కి ఎంతో విశిష్టత ఉంది. ఏడాది పొడవునా వచ్చే 24 ఏకాదశుల ఫలితాన్ని ఒకే ఒక్క నిర్జల ఏకాదశి వ్రతం ద్వారా పొందవచ్చని పురాణాలు చెబుతున్నాయి. అయితే, పేరులోనే ఉన్నట్లుగా 'నిర్జల' అంటే నీటి చుక్క కూడా తీసుకోకుండా చేసే ఈ కఠిన వ్రతం గురించి, ప్రస్తుత వేసవి కాలంలో పలు సందేహాలు తలెత్తుతున్నాయి.

నిర్జల ఏకాదశి రోజున సూర్యోదయానికి ముందే నిద్రలేచి స్నానాదులు ముగించుకుని, భగవంతుడికి వ్రత సంకల్పం చేయాలి. మరుసటి రోజు సూర్యోదయం వరకు అన్నపానీయాలు తీసుకోకూడదు. ఈ నియమాన్ని పాటిస్తేనే వ్రత సంపూర్ణ ఫలితం దక్కుతుందని శాస్త్రాలు పేర్కొంటున్నాయి. అయితే, ఎండలు మండుతున్న సమయంలో నీరు తాగకుండా ఉండటం వల్ల డీహైడ్రేషన్ లేదా ఇతర ఆరోగ్య సమస్యలు తలెత్తే...