భారతదేశం, సెప్టెంబర్ 9 -- Ninnu Kori September 9 Episode: నిన్ను కోరి సీరియల్ టుడే సెప్టెంబర్ 9 ఎపిసోడ్ లో స్టోరీని మలుపు తిప్పే ట్విస్ట్ చోటు చేసుకుంటుంది. హాస్పిటల్‌లో చావుబతుకుల మధ్య పోరాడుతున్న విరాట్ ను చూసి మదన్, చంద్రకళ బాధపడతారు. అప్పుడే మదన్ కు ఓ సంచలన ఐడియా వస్తుంది. విరాట్ ను ఎలాగైనా కాపాడాలని అనుకుంటాడు.

హాస్పిటల్లో ప్రాణాలతో పోరాడుతున్న విరాట్ ను కాపాడేందుకు మదన్ తెగ ఆలోచిస్తుంటాడు. అప్పుడే ఓ ఆలోచన వస్తుంది. వారం రోజులుగా మార్చురీలో ఓ గుర్తింపు లేని అనాథ శవం ఉందని మదన్ కు తెలుస్తుంది. ఆ శవాన్ని మున్సిపాలిటీకి అప్పగించి, దహనం చేయించబోతున్నారని కూడా సమాచారం అందుతుంది.

అనాథ శవం గురించి తెలుసుకున్న వెంటనే మదన్ వెళ్లి డాక్టర్లను కలుస్తాడు. ప్లాస్టిక్ సర్జరీతో ఆ అనాథ శవం ముఖాన్ని విరాట్ శరీరానికి పెట్టొచ్చా అని డాక్టర్లను మదన్ అడ...