భారతదేశం, సెప్టెంబర్ 8 -- Ninnu Kori Serial Today Episode: నిన్ను కోరి సీరియల్ ఈరోజు ఎపిసోడ్‌లో ఊహించని ట్విస్ట్ ఎదురవుతుంది. మాయ ప్రయాణిస్తున్న ఆటోను పట్టుకోవాలనే తాపత్రయంతో విరాట్ తన కారులో వేగంగా వెంబడిస్తాడు. అసలు ఇదంతా మాయ ఎందుకు చేస్తుందని ఆలోచిస్తూ డ్రైవ్ చేస్తుంటాడు విరాట్.

సరిగ్గా మాయను చేరుకునే సమయానికి, వెనుక నుంచి వేగంగా వచ్చిన ఒక భారీ లారీ విరాట్ కారును చాలా బలంగా ఢీకొడుతుంది. ఈ ఘోర ప్రమాదంలో విరాట్ కారు నుజ్జునుజ్జు అవుతుంది. డ్రైవింగ్ సీట్‌లో ఉన్న విరాట్‌కు తీవ్రంగా గాయాలు అవుతాయి. ఒంటినిండా గాయాలతో, రక్తపు మడుగులో విరాట్ ప్రాణాలతో కొట్టుమిట్టాడుతుంటాడు.

అదే సమయంలో విరాట్‌కు భార్య చంద్రకళ నుంచి ఫోన్ వస్తుంది. ఎక్కడున్నారు, ఏం చేస్తున్నారు అంటూ చంద్రకళ ప్రశ్నల వర్షం కురిపిస్తుంది. ప్రాణాలను అరచేతిలో పట్టుకున్న విరాట్ ఎలాగై...