భారతదేశం, సెప్టెంబర్ 4 -- Ninnu Kori Serial Today Episode: నిన్ను కోరి సీరియల్ ఈరోజు ఎపిసోడ్‌లో జగదీశ్వరి చికిత్స కోసం మాయ బిడ్డ శాంపిల్స్ ల్యాబ్ పరీక్షల్లో మ్యాచ్ కాకపోతే విరాట్ నిన్ను ఇల్లు దాటించేస్తాడని శాలిని హెచ్చరిస్తుంది, భయపెడుతుంది. అయినా మాయ ఏమాత్రం బెదరదు.

"నా మెడలో విరాట్ కట్టిన తాళి ఉంది, నన్ను ఈ ఇంటి నుంచి ఎవరూ వెళ్లగొట్టలేరు" అని మాయ చాలా నమ్మకంగా బల్లగుద్ది చెబుతుంది. మాయ చూపిస్తున్న ఈ ఓవర్ కాన్ఫిడెన్స్ చూసి శాలినికి ఎందుకో బాగా అనుమానం కలుగుతుంది.

మరోవైపు చంద్రకళ కావాలనే విరాట్ గదికి వెళ్లి అతడికి దగ్గరగా ఉంటూ రొమాంటిక్‌గా ప్రవర్తిస్తుంటుంది. ఇదంతా చూసిన మాయకు మండిపోతుంది. మాయ చూస్తుందని మరింత రెచ్చిపోతుంది చంద్రకళ. అదంతా గమనించిన మందర.. చంద్రకళ ప్రవర్తనలో ఏదో పెద్ద తేడా ఉందని అనుమానించి అదే విషయం మాయకు చెప్పి హెచ్చరిస...