భారతదేశం, సెప్టెంబర్ 18 -- Ninnu kori September 18 Episode: నిన్ను కోరి సీరియల్ ఈ రోజు ఎపిసోడ్ లో ఉత్కంఠ కొనసాగుతోంది. బుల్లితెరపై స్టార్ మాలో ప్రసారమవుతున్న ఈ సీరియల్ అత్యంత నాటకీయ మలుపులతో ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. విరాట్ (సామ్రాట్) జ్ఞాపకశక్తి కోల్పోవడంతో ఇంటి సభ్యుల ప్రవర్తన, మరోవైపు ఊరి జనాల రాకతో కథలో తీవ్ర ఉత్కంఠ నెలకొంది.

కనిపించకుండా పోయిన విరాట్ కోసం జగదీశ్వరి బాధపడుతుంది. అయితే తాను ఎలాగైనా విరాట్ ను తీసుకొస్తానని అత్త జగదీశ్వరికి చంద్ర చెప్తుంది. అయితే అందుకు జగదీశ్వరి మూడు నెలల గడువు ఇస్తుంది. మూడు నెలల తరువాత ఎట్టి పరిస్థిలోనూ ఇంటికి రావాలి అని చెబుతుంది.

మరోవైపు దాక్షాయణి నివాసంలో సామ్రాట్ ముఖంపై ఉన్న విరాట్‌పై శ్రీజ అతిగా ప్రేమ కురిపిస్తుంది. అతనికి కాఫీ ఇస్తుంది. దీంతో విరాట్ కు కొంత మానసిక ఒత్తిడి పెరుగుతుంది. సరిగ్...