భారతదేశం, మార్చి 24 -- Ninnu Kori Serial Today Episode: నిన్ను కోరి సీరియల్ ఈరోజు ఎపిసోడ్‌లో రఘురాం ఏదో ఆలోచిస్తుంటే శాలిని చూస్తుంది. బుక్‌లో రాసుకుంది రఘురాం చదువుతాడు. అది శాలిని వింటుంది. నేనేంటీ ఇలా రాసుకున్నా. జగదీశ్వరికి ఈ విషయం తెలియద్దు అని పేపర్ చింపి పాకెట్‌లో పెట్టుకుంటుండగా గాలికి ఎగిరిపోతుంది.

ఆ పేపర్ వెంట రఘురాం పడతాడు. అదే పేపర్ కోసం శాలిని చూస్తుంటే ఇంతలో క్రాంతి అడ్డుపడతాడు. శాలిని కిందపడబోతుంటే క్రాంతి పట్టుకుంటాడు. ఇద్దరు రొమాంటిక్‌గా చూసుకుంటారు. తర్వాత శాలినిని కింద పడేస్తాడు. ఇంతలో రఘురాం వచ్చి పేపర్ కోసం వెతుకుతున్నా అంటాడు. అదేంటో చెప్పబొతుంటే ఫ్లవర్ వాజ్ కింద పడేస్తుంది శాలిని.

దాంతో మర్చిపోతాడు రఘురాం. ఏ పేపర్ కోసం వెతుకున్నారని క్రాంతి అడిగితే.. ఏ పేపర్ అని రివర్స్‌లో అడుగుతాడు రఘురాం. న్యూస్ పేపర్ అని శాలిని...